![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -831 లో.. రిషి ప్లెక్సీ షాప్ కి వెళ్లి అక్కడ తను, వసుధారల ఎంగేజ్మెంట్ ఫోటో చూసి షాక్ అవుతాడు. ఇక్కడ ఎందుకు ఉందని రిషి అడుగుతాడు. విష్ కాలేజీ బాయ్ వచ్చి ప్లెక్సీ కావాలన్నాడని అతను చెప్పగానే.. రిషి ఆలోచనలో పడతాడు. అంత అవసరం ఎవరికీ ఉంది నా గతం తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు. ఎలాగైనా నిజం తెలుసుకోవాలని రిషి అనుకుంటాడు.
ఆ తర్వాత కాలేజీ బాయ్ ఫ్లెక్స్ షాప్ కి వస్తాడు. అక్కడ రిషి ని చూసి అక్కడే ఆగిపోయి శైలేంద్రకి ఫోన్ చేస్తాడు. శైలేంద్ర ప్లాన్ ఫెయిల్ చేసావని కాలేజీ బాయ్ ని తిడతాడు. కొందరు రౌడీలను పంపిస్తున్నాను. రిషి ని వాళ్లకి చూపించు అంతా వాళ్ళు చూసుకుంటారని శైలేంద్ర చెప్పగానే కాలేజీ బాయ్ సరేనని అంటాడు. మరొక వైపు వసుధార, మహేంద్ర కోసం ఎదురు చూస్తుంటుంది. అప్పుడే మహేంద్ర వస్తాడు. ఇప్పుడు రిషి ఎక్కడ ఉన్నాడని వసుధారని అడుగగా.. తెలియదని వసుధార చెప్పి .. ప్రిన్సిపల్ సర్ కి ఫోన్ చేసి రిషి గురించి అడుగుతుంది. రిషి ఫ్లెక్సీ షాప్ కి వెళ్ళాడని ప్రిన్సిపల్ చెప్తాడు. వాళ్ళిద్దరు ప్లెక్సీ షాప్ కి బయలుదేర్తారు.
మరొక వైపు రిషి ప్లెక్సీ షాప్ ముందే కాలేజీ బాయ్ కోసం చూస్తుంటాడు. తనని ఈ పని ఎవరు చెయ్యమన్నారని అడిగి నిజం తెలుసుకోవాలని రిషి అనుకుంటాడు. అప్పుడే కొంతమంది రౌడీలు రిషి దగ్గరికి వచ్చి కార్ లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ప్లెక్సీ షాప్ దగ్గరకి వసుధార, మహేంద్ర వస్తారు. అక్కడ ఉన్న అతను.. ఎవరో రౌడీలు తీసుకొని వెళ్తున్నారని చెప్పగానే.. ఆ రౌడీల వెనకాలే మహేంద్ర, వసుధార ఇద్దరు వెళ్తారు. వసుధార పోలిస్ లకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ తర్వాత రౌడీలను రిషి కొడుతుండగా.. రౌడీ లు రిషి ముక్కుకి మత్తు ఇస్తారు. అప్పుడే వసుధార, మహేంద్ర లు రిషి దగ్గరికి వస్తారు. మహేంద్ర రౌడీలను కొడతాడు. పోలీసులు వచ్చే లోపు రౌడీలు పారిపోతారు. ఆ తర్వాత మా ఇంటికి తీసుకొని వెళ్ళండి సర్ అని మహేంద్రకు వసుధార చెప్తుంది. సరే అని మహేంద్ర, వసుధార కలిసి ఇంటికి బయలుదేర్తారు. అప్పుడే మహేంద్రకి జగతి ఫోన్ చేసి రిషి గురించి అడుగుతుంది. జరిగిందేం చెప్పకుండా రిషి బాగున్నాడు. నువ్వు కంగారు పడకని జగతికి మహేంద్ర చెప్తాడు.
మరొకవైపు శైలేంద్ర ప్లాన్ ఫెయిల్ చేసారని రౌడీలను తిడతాడు. ఆ తర్వాత రిషిని వసుధార ఇంటికి తీసుకొని వెళ్లి.. బెడ్ పై పడుకోబెట్టి రిషిని జాగ్రత్తగా చూసుకుంటుంది. కొద్దీ సేపటికి మైకం లో నుండి బయటకు వచ్చిన రిషి మహేంద్రని చూస్తాడు. డాడ్ మనం ఎక్కడ ఉన్నామని అడుగుతాడు. వసుధార వాళ్ళింట్లో అని మహేంద్ర అనగానే.. ఇక్కడ ఎందుకు ఉన్నాం వెళదాం పదండని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |